RSS

Monthly Archives: March 2017

Color ME – – Nursery Poem

Color me red
Apples are red
Roses are red
My Pencil is red

Color me blue
Sky is blue
Ocean water is blue
My Yeti toy is blue

Color me yellow
Mums are yellow
Sunflowers are yellow
My granny’s teeth are yellow

Color me black
Night is black
Hair is black
My pen’s ink is black

Color me white
Swans are white
Clouds are white
My polar bear is white

Color me pink
Begonias are pink
Mom’s lipstick is pink
My friend’s bedroom is pink

Color me green
Grass is green
Leaves are green
My water bottle is green

Violets, Browns, Oranges, and Indigos all make great friends
Friends are colorful
Colors are friendly!

~ Savvy

 
Leave a comment

Posted by on March 27, 2017 in Nursery Poems

 

Katama Rayudu

The Movie: Katama Rayudu

images

Caption:  Just the name is enough

Savvy’s Rating: 3.25 / 5

Zephyr: An entertaining movie ; Director handled PK well.

Brush off:

  1. Shruti Hassan looked different and unrecognizable (compared to her previous movies) ; her costumes in all songs were disastrous
  2. Obvious glitches like 1) when the kid is missed at the temple, why can’t family call her and fretting bad whereas Katama calls her to play hide and seek ; 2) didn’t have proper closure of Radia and his son’s story
  3. Wonder why all brothers were asked to have beards and only Katama is clean shaven; this ended up other brothers looking stale and older in front of Katama
  4. Many fighting scenes and some are real barbaric
  5. Not a fan of showing JanaSena logo in the movie. Suggestion to PK: keep movies and politics separate. It gives clarity to YOU and People. Else there comes a day where people don’t vote if they are miffed up with your flop movie ; they boycott your movie, if they are unhappy with your political career. You will be in catch22 situation. Oh btw, you are creating this situation, dude!  😉

Savvy’s Rede:

A movie must be embraced and loved by all, if it stands by its primary motive which is to provide entertainment. Katama fits the bill.  

Story in a nutshell:

Remake of Tamil movie, Veeram, but customized to enhance political aspirations and enlarge commercial image of Pawan Kalyan. It’s a treat for fans and a good entertainer for rest of the audience.

Movie starts off with 5 aged brothers with no aspirations of marriage. Of which, elder brother is treated as God. As it revealed, 3 of his brothers are secretly in love.  It reminds you of “Peddarikam” movie. Before one could jump into conclusions, things change as the story moves along. Katama is known for his ferocious handling of enemies and compassion for poor and the needy. There comes a love interest in his life by name Avantika, who’s is a fan of nonviolence. As the love tryst getting serious, Katama’s enemies list is growing.

Whether Katama leaves his violent behavior? Whether Avantika accepts Katama as he is or expects him to change for her? What happens to Katama’s enemies? Is there any story behind Katama’s life? Watch the move onScreen to get answers.

What worked well:

  1. I have immense respect for the Directors who handle big heroes, especially PK. Kishore Kumar Pardasani (aka Dolly) got most out of PK in a controlled manner. You would see PK’s performance to the point showing varied versions of Katama like mature version, silly version, and romantic version 
  2. I loved watching PK in a love proposing scene. His eyes, more than his body language, were perfectly captured / set to express the love. My fav scene from the movie
  3. Supporting characters have given their genuine performance. Of all brothers, my vote goes to Ajay. He just outdid his character ; Rao Ramesh has done tremendous job but sadly his role was not fully justified and left unfulfilling
  4. Few songs are good. I liked “Emo Emo” written by Ananth Sriram
  5. Veeram was a super duper hit in Tamil. Betting on a remake, with PK as the Lead, is a safe bet. Can’t ask more. Producers and Distributors are happy. I have a feeling that this movie will continue to rake the profits. Let’s see if Bahubali 2 can stop Katama

Savvy’s Punch:

Watch it with your friends and family.

Savvy’s Hearts:

heartheartheart– Entire cast and the crew 

 
Leave a comment

Posted by on March 25, 2017 in Movie Reviews, Telugu

 

!!!పూ-హృదయం!!!

కవితా దినోత్సవం అంట
చెప్పాలనుకున్న ఒక మాట

Chrysanthemum-Meaning

PC: WWW

ఆ కాళ్ళు మళ్ళీ పూదోట వైపు వస్తున్నాయ్
ఆ చేతులు సిరి చామంతుల మీద పడనున్నాయ్

అమ్మా అమ్మా అని నేల తల్లిని ఆప్యాయంగా పిలిచింది పిల్ల చామంతి,
ఇటీవలే పుట్టి, కనీ కనిపించని ఆకు పచ్చ, పసుపు లేత రెక్కలతో
బిడియంగా, భయంగా ఇలా అంది
అమ్మా ఆ యముడు రోజూ వస్తాడు
నిన్న లాగే ఈ రోజూ నా స్నేహితులని తెగ్గోసి తన బుట్టలో వేసుకుంటాడు

మొన్న విసురుగా కొన్ని పూలను ఇటు చల్లాడు
కొన ప్రాణంతో ఉన్న నా సఖి ఇలా చెప్పింది
దేవుని హారం మన పాలిట యమపాశం
మాలగా మార్చేందుకు కాడల్ని కత్తిరించి
సూదితో పొడిచి పొడిచి, దారంతో ఆ గాయాన్ని పదే పదే కెలుకుతూ
గర్వన్గా వేలుపు కంఠంలో వేస్తారు
లేపోతే జీవంలేని జుత్తులో బలవంతంగా దోపుతారు
దేవుని పాదాలు స్వర్గం అవి తాకేందుకు మనం రోజూ చూడాలి నరకం

అమ్మా ఆ యముణ్ణి ఆపేదెలా?!?!
అతడి రాక సమయం నాకు పుడుతుంది ప్రాణభయం
సీతాకోక నయం, నాతో ఆడుతూ పాడుతుంది
నాకు ఇక్కడే పెరిగి, పెద్దయ్యాక నీలో కలిసిపోవాలనుంది
మనలోనే దేవుడుంటే, మళ్ళీ ఆ రాయికేలా పూజలు?
చెప్పమ్మా, ఆ యముణ్ణి ఆపేదెలా?!?!

ఆ కాళ్ళు చర చరా ఇటువైపే వస్తున్నాయ్
ఆ చేతులు సిరి చామంతుల మీద పడనున్నాయ్

ఇంతలో సీతాకోక ఒకటి విహంగంలా వచ్చి
నీకు తేనె కావాలా లేక పూదండ కావాలా
అని రుస రుస లాడుతూ అడిగింది ఆ యముణ్ణి

తెలుపు, నలుపు, పసుపు, పచ్చ చారలతో
నారింజ కొనలతో, రెక్కలు అందంగా ఊపుతూ
తన కన్నుల్ని నలుదిశలా తిప్పుతూ
ముగ్ధ మోహనంగా అడిగిన ప్రశ్నకి
అతడు సంభ్రమంలో మునిగి, తేరుకుని

దేవుని హారం, అన్ని కోరికలకు ద్వారం
నాకు తెలిసింది కేవలం భక్తి మతం
పూ-హారం చేయాలి ప్రతి దినం
వేయాలి గోవిందుని మెడలో ఖాయం
నీ స్నేహితుడు బతకాలంటే వెయ్యి దేవునిపై భారం
అయినా పూజకు రాను అనే పూవుకు ఉండునా ముక్తీ  మోక్షం?
చిర్రు బుర్రులు నీ దగ్గరే ఉండనీ, నన్ను నా పని చెయ్యనీ

అతడిలో చెప్పలేని రోషం, బలవంతుడననే అహం
కసిగా ఆ చేతులు సున్నిత పూలపై దాడి చెయ్యబోయాయ్
మనిషొకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తెలుస్తాడోయ్

అదాటుగా అన్ని పూలూ నిరసన చేసాయ్
ఉక్రోషంగా కొన్ని వంగిపోయాయ్
ముట్టుకోగానే కొన్ని ఢీలా పడిపోయాయ్
పట్టుకునే లోపే కొన్ని రాలిపోయాయ్

వాడిన పూలు, వంగిన పూలు, ఎంగిలి పడ్డ పూలు కావు మాలకు కైదండ
యముడి మిడిసిపాటుపై పడింది అనుకోని పెద్ద బండ
తెచ్చిన పాశం మారింది చిన్న దారపు ఉండ
దేవుడే నడిచొచ్చి చేసాడు పూలకు సాయం
అడగ్గానే వస్తేనే కదా మరి దేవుడికి ప్రబలం

Chrysanthemum-yellow-4.JPG

ముళ్ల కంచెతో ఆ పూలవనం భద్రం
ఆ పూవులు కేవలం దేవుని పరం
ఆ పూల హృదయం దేవునికే అంకితం
సీతాకోకకి ఇప్పుడు చెప్పలేని ఆనందం
పిల్ల చామంతికి తెలీని సంతుష్టం !

~ Savvy

 
Leave a comment

Posted by on March 22, 2017 in RandomActOfWriting - Telugu

 

!!!వ్యక్తి’గతం’!!!

చెలియా, నీ కురుల్లో రోజానై
రోజంతా నీతో తిరగనా
నాలోని సుగంధం నీ నవ్వులో కలిపి
మత్తు మందుగా మారనా, నిను మైమరపించనా

వాడిపోయిన  వేళ నీ పుస్తకంలో జ్ఞాపకంలా మిగలనా
పుస్తకం తీసి నేనున్న పేజీ వచ్చిన ప్రతిసారీ
నీ ముసినవ్వులో మరుపువ్వునైపోనా

నను చూసిన నీ కళ్ళలోని కాంతి
నను తాకి నీకు గుర్తుచ్చిన మధుర స్మృతి
నీ నుంచి నేనెన్నడూ వీడలేదని తెలుపుతున్నది
వడలినా వాసి తగ్గలేదని నిరూపిస్తున్నది

నే పచ్చగా ఉన్న, వాడినా నా ఉనికి మారదు
మన ప్రేమ కూడా అంతే
దూరమైనా దాని విలువ తగ్గదు

Rose

PC: WWW

నీ కాలచక్రంలో నేనొక గతం
నీ ఒంటరి పయనంలో నేనొక నీడ
నీ అడుగుల అచ్చుల్లో నేనొక ముద్ర
నీ చేతుల భంగిమలో నేనొక రూపు
నీ కన్నుల కొనల్లో నేనొక దృశ్యం

నిను వీడి నేను లేను అదొక నిజం
నను వీడి నువ్వున్నా లేనట్టే ఇది యదార్థం !

 

 
Leave a comment

Posted by on March 10, 2017 in RandomActOfWriting - Telugu

 

!!!జనపదం – ద ప్రపోసల్!!!

యేర్లూ నాటే కాడ , పొలం దున్నే కాడ
యేటి గట్టుమీద , మోట బాయి కాడ
సద్ది బువ్వ పట్టుకొచ్చి , ముద్ద ముద్ద తినిపించి
యేమార్చినవే ఓ రంగి, నీ ఒడ్ని చేసినావే

ఏడాది కాలం కింద, పంట నష్టపోతే
అమ్మ నైన సచ్చిపోతే, నే తాగి తూగి పడితే
మంచి మాటలను చెప్పి నన్ను మల్ల దార్ల పెట్టి
మాయజేసినావె ఓ రంగి, నీ మత్తులోకి దించినావే

పొలం కాపు కాసే ఏల, జిమ్మ చీకట్లోన
కీచురాళ్ళ మోతలోన, నే సలికి ఒణుకుతుంటే,
ఊలు చెద్దరిచ్చి, చేతికి తావీజు కట్టి
నువ్వు జల్దీ ఉరికిపోయినావే, ఓ రంగి, నా దిల్ తీస్కపోయినావే

పంట కోత ఏల, వరి కంకి కోసే కాడ
మక్క బుట్టల్ ఏరే కాడ, కందులు పీకే ఏల
చాప కూర జొన్ని రొట్టి తీసుకొచ్చి, ఎండ పొడకు నీ కొంగుకట్టి
ఎంట ఎంట తిప్పుకున్నావే ఓ రంగి, నా మనసులోకి వచ్చినావే

పంట పైసలు చేతికొచ్చే, కౌలు బాకీ పోనూ కొంత మిగిలే
ఇంట్ల గంపెడాన్ని బియ్యం, ఉండనీకి చిన్న గుడిసె
నీకు నాకూ మస్తుగా సరిపోతాయే ఓ రంగి
నిన్నేలు కుంటనే ఓ రంగి
నిను యిడిచి నేనుండలేనే ఓ రంగి
నాతోడే ఒప్పుకోవే నా రంగి
నీ తోడై ఉంటా జీవితాంతం ఓ రంగి!

~ Savvy

 
 

!!జనపదం!!

ఉత్తరాన ఉన్న నా మావ ఉత్తరం రాస్తానన్నడే
ఉత్తరం కోసం ఉర్కి ఉర్కి ఉత్త చేత్ల మల్లొచ్చిన్న
ఊరి బస్సు ఆగే కాడ పడిగాపు గాసి సొమ్మసిల్లిన

మూడు దినాలైంది, మూడు నెలలైంది
మావ మాట ఇని మూడు ఏళ్లయింది

పట్టీల్ కొంటనని పట్నం పోయిండే
కమ్మల్ కొంటనని కట్టెల్ పనికి పోయిండే
గజ్జెల్ కొంటనని గంజిల పనికి పోయిండే
నెక్లెస్ కొంటనని నన్నిడిచి పోయిండే

నగలొద్దు పైసలొద్దు నువ్ పక్కనుంటే సాలు నాకు
నీ మాటల మూటలే నికరం బంగారం నాకు!

missu

PC: WWW

ఉత్తరాన ఉన్న నా మావ ఉత్తరం రాశినడే

పున్నం కి వస్తనని నన్ను మర్వలేదని
పెల్లి జేస్కుంటనని పట్నం తీస్కపోతనని
మస్తు మస్తు రాషిండే గారవం పోయిండే
ఉత్తరం ల నా మావ లొల్లి లొల్లి జేషిండే
మల్ల మల్ల సదువుకొని ముద్ద మందారమైననే

నగలొద్దు పైసలొద్దు నువ్ పక్కనుంటే సాలు నాకు
నా కల్ల కాటుక నువ్వు
నా కాళ్ళ గోరింట నువ్వు
మావ నీ తోడే హమేషా
మావా, నువ్ నా ఓడివే హమేషా !

~ Savvy